గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి : బదావత్ సంతోష్

గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి :  బదావత్ సంతోష్

ఆదిలాబాద్/నస్పూర్, వెలుగు: గ్రూప్1 పరీక్షల నిర్వహణకు జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ భవనంలో అడిషనల్ కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, డీసీపీ అశోక్ కుమార్ తో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల కోసం జిల్లాలో 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9,384మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్ష ప్రశాంత వాతారణంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. 

ఆర్డీఓ రాములు, పరీక్ష నోడల్ అధికారి, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రన్సిపల్ చక్రపాణి, డీఈఓ యాదయ్య, జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. గురువారం ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని, మాల్ ప్రాక్టీస్ జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 6, 729 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. పరీక్ష రాసేవారు ఉదయం 9 గంటలలోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.