ముగిసిన గ్రూప్ 2 దరఖాస్తు గడువు

ముగిసిన గ్రూప్ 2 దరఖాస్తు గడువు

తెలంగాణలో గ్రూప్ 2 దరఖాస్తు గడువు ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 5లక్షల 50వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‭పీఎస్సీ తెలిపింది. మరికాసేపట్లో మొత్తం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య వివరాలను టీఎస్‭పీఎస్సీ అధికారులు వెల్లడించనున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 అప్లికేషన్ల ప్రక్రియను జనవరి 18 ప్రారంభించింది. గ్రూప్ 4 దరఖాస్తు గడువు పెంచినట్లే గ్రూప్ 2 అప్లికేషన్ల గడువు పెంచే ప్రసక్తేలేదని అధికారులు ఇంతకు ముందే ప్రకటించారు.