తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా

తెలంగాణలో  గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదాపడింది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ టీఎస్ పీఎస్సీ  ప్రకటించింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని టీఎస్ పీఎస్పీ తెలిపింది. జనవరి 6, 7 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. 

గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటం ఇదో మూడో సారి. 18 విభాగాల్లో 783 గ్రూప్ 2 పోస్టులకు 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్ పీఎస్సీ. కొత్త బోర్డును నియమించాకే పరీక్షల నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.