గ్రూప్ 4 ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్

గ్రూప్ 4 ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 పరీక్షల తేదీని ఖరారు చేసింది. జులై 1న ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రెండు సెషన్స్ లో రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్రటేరియల్ ఎబిలిటీస్ పరీక్ష జరపనున్నారు. ఓఎంఆర్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 8,180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్పీ గతేడాది డిసెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేయగా.. లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 30తో అప్లికేషన్ల గడువు ముగియగా.. టీఎస్పీఎస్సీ దాన్ని ఫిబ్రవరి 3 వరకు పొడగించింది.  ఇప్పటి వరకు 9 లక్షల మందికిపైగా అభ్యర్థులు గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు