దరఖాస్తులకు 8,039 పోస్టులనే చూపించిన కమిషన్
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 పోస్టులు భారీగా తగ్గినయ్. డిసెంబర్ 1న రిలీజ్చేసిన నోటిఫికేషన్లో 9,168 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన టీఎస్పీఎస్సీ శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసిన డిటైల్డ్ నోటిఫికేషన్లో మాత్రం 1,100 పోస్టులను తగ్గించింది. నోటిఫికేషన్లో చూపిన ఖాళీలకు డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన డేటాకు మధ్య వ్యత్యాసం ఉందని పరీక్ష తేదీ లోపు ఆ పోస్టులపై డిపార్ట్ మెంట్ల నుంచి క్లారిటీ వస్తే ఆ మేరకు కలుపుతామని పేర్కొంది. అయితే ఈ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చే డేటాలో మరిన్ని పోస్టులు తగ్గితే ఆ మేరకు పోస్టులు కోతపెడతామని వివరించింది.
అలాగే ఈ డిటైల్డ్ నోటిఫికేషన్లో పంచాయతీరాజ్ పోస్టులను పూర్తిగా తొలగించింది. కమిషన్ ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం నుంచే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అంతా భావించినా, టెక్నికల్ సమస్యలతో మొదలుకాలేదు. దీంతో మరోసారి వాయిదా పడుతుందేమోనని అభ్యర్థులు ఆందోళన చెందారు. కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత వెబ్ సైట్ లో అప్లికేషన్ల ప్రక్రియ మొదలుపెట్టారు.
