బాలీవుడ్ సెలబ్రెటీ కపుల్ "అవికా గోర్, మిలింద్ చంద్వానిలు" పరిచయం అక్కర్లేని పేర్లు. అవికా గోర్ తెలుగులో 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మామ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో బిజీగా మరి బిజినెస్ మెన్ అయిన మిలింద్ చాద్వానీతో ఏడడుగులు వేసింది. ఈ జంట 2025 సెప్టెంబర్ 30న ఒక లైవ్ షోలో పెళ్లి చేసుకుని సినీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు.
సోషల్ మీడియాను ఊపేసేలా సెలబ్రిటీ కపుల్ మిలింద్ చాద్వాన-అవికా జిమ్ ఫోటో షేర్ చేశారు. జిమ్‌లో కలిసి వర్కౌట్స్ చేస్తూ దిగిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అందులో సిక్స్ ప్యాక్ బాడీతో మిలింద్ ఆకట్టుకోగా, జిమ్ సూట్‌లో స్టైలిష్ లుక్‌తో అవికా చూపులను తనవైపు తిప్పుకుంది. భర్తతో కలిసి సెల్ఫీ దిగుతూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. ఈ జంట కలిసికట్టుగా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం నెటిజన్లకు కొత్త ట్రెండ్‌గా మారింది. దీంతో కామెంట్ల వర్షం కురుస్తూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మిలింద్ చంద్వాని ఎవరు?
మిలింద్ చంద్వానీ క్యాంప్ డైరీస్ అనే NGOను కూడా నడుపుతున్నాడు. IIM అహ్మదాబాద్ నుంచి MBA పట్టభద్రుడైన మిలింద్ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తన జీవితాన్ని మొదలు పెట్టాడు. 2019లో MTV రోడీస్ రియల్ హీరోస్ షో ద్వారా పాపులర్ అయ్యాడు.
తెలుగులో చిన్నారి పెళ్లి కూతురితో ఫేమస్ అయిన ఆవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సినిమా చూపిస్తా మావా..ఎక్కడికి పోతావు చిన్నవాడా,బ్రో,షణ్ముఖ, లక్ష్మీ రావే మా ఇంటికి వంటి సినిమాల్లో నటించింది ఆవికా గోర్. ఈ క్రమంలోనే 'బాలికా వధు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా 'గోపిక'గా పేరును సొంతం చేసుకుంది ఆవికా.
