Keerthy Suresh: యాక్షన్ మోడ్‌లో కీర్తి సురేష్... ‘తోట్టం’ ఫస్ట్ లుక్ వైరల్!

Keerthy Suresh: యాక్షన్ మోడ్‌లో కీర్తి సురేష్... ‘తోట్టం’ ఫస్ట్ లుక్ వైరల్!

వరుస సినిమా ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉంది నటి కీర్తి సురేష్.  తెలుగు, తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదితో తన సత్తాను చాటుతోంది . ప్రస్తుతం తెలుగులో టాలీవుడ్  రౌడీ స్టార్ విజయదేవరకొండ సరసన 'రౌడీ జనార్థన్' మూవీలో నటిస్తోంది. మరోవైపు మలయాళ వెండితెరపై మరో పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ 'తోట్టం' సినిమాలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.  లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

రా అండ్ రస్టిక్ లుక్‌లో కీర్తి సురేష్

దర్శకుడు రిషి శివకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గ్రిట్టీ అండ్ హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. మంచుతో నిండిన వీధిలో, పగిలిన సీసాల మధ్య కీర్తి సురేష్ నిలబడి ఉన్న తీరు ఎంతో ఇంటెన్స్‌గా ఉంది. ఆమె చేతిలో రక్తం అంటిన పగిలిన గాజు గ్లాసు, పాత లెదర్ బ్యాగ్ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో కొంతమంది వ్యక్తులు గొడవ పడుతుండటం సినిమాలోని డార్క్ అండ్ వయలెంట్ మూడ్‌ను ప్రతిబింబిస్తోంది. "ఆమె అడుగు పెట్టింది.. ఇక ఈ ఏడాది మండుతుంది. అందరికీ సాహసోపేతమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు" అంటూ మేకర్స్ ఈ పోస్టర్‌ను పంచుకున్నారు.

క్రేజీ కాంబినేషన్.. భారీ టెక్నికల్ టీమ్

ఈ సినిమాతో మలయాళ యంగ్ హీరో 'RDX' ఫేమ్ ఆంటోనీ వర్గీస్ పెపే, కీర్తి సురేష్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే మాలీవుడ్‌లో భారీ క్రేజ్ నెలకొంది. ఈ మూవీకి దర్శకుడిగా రిషి శివకుమార్ వహిస్తున్నారు. విజయ్ నటించిన కత్తి, తేరి వంటి చిత్రాలకు పనిచేసిన జార్జ్ సి. విలియమ్స్ దీనికి విజువల్స్ అందిస్తున్నారు.  యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నారు.

►ALSO READ | Thalaivar 173 Director: రజనీ - కమల్ కాంబోపై బిగ్ అప్డేట్.. ‘తలైవర్ 173’ డైరెక్టర్ కుర్చీలో కూర్చునేది ఇతనే

కీర్తి సురేష్ కెరీర్‌లో మరో మైలురాయి?

ఇటీవలే తమిళంలో 'రివాల్వర్ రీటా'తో మెప్పించిన కీర్తి, వరుణ్ ధావన్ సరసన 'బేబీ జాన్' సినిమాతో బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మలయాళంలో 'తోట్టం' వంటి లేడీ ఓరియంటెడ్ యాక్షన్ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నారు.  AVA ప్రొడక్షన్స్, ఫస్ట్ పేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే  ప్రారంభం కానుంది. తన విలక్షణ నటనతో ఇప్పటికే సౌత్ ఇండియాను ఏలుతున్న కీర్తి, ఈ 'తోట్టం'తో మరో సంచలనం సృష్టిస్తుందో లేదో చూడాలి!