కరోనా ఆంక్షలు ఎత్తివేయాలంటూ ముద్దులతో నిరసన

కరోనా ఆంక్షలు ఎత్తివేయాలంటూ ముద్దులతో నిరసన
ఓవైపు ప్రపంచ దేశాలు కొత్త కరోనా వైరస్ తో వణికిపోతుంటే..,మరోవైపు కరోనా ఆంక్షలతో ఎంటర్ టైన్మెంట్ మిస్సవుతున్నామంటూ ఆందోళనలు చేయడం ఆసక్తికరంగా మారింది. రష్యాలో 30 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. అందులో 20లక్షలు మందికి పైగా వైరస్ తగ్గింది. 55,107మందికి కరోనా కారణంగా మరణించారు. తాజాగా కొత్తకరోనా వైరస్ వ్యాప్తితో అప్రమ్తమైన రష్యా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే ఈ ఆంక్షలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారో అర్ధం కావడంలేదు. ఎంటర్ టైన్మెంట్ తో పాటు ఆస్పత్రికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందంటూ 30 జంటలు ట్రైన్లలో ముద్దులతో నిరసనకు దిగాయి. నేషనల్ మీడియా కథనం ప్రకారం మెకానికల్ ఇంజనీరింగ్ రైల్వే స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు వెళుతున్న ట్రైన్ లో సుమారు 30 జంటలు ముద్దులతో తమ నిరసన తెలిపాయి. కదులుతున్న ట్రైన్ లో ప్రపంచాన్ని మైమరిచి ముద్దులతో నిరసన వ్యక్తం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11గంటల తరువాత బార్లు ఎందుకు క్లోజ్ చేస్తున్నారో అర్ధం కావడంలేదు. ఎంటర్ టైన్మెంట్ మిస్సవుతున్నాం. డ్యాన్స్  ఫోర్లపై నిషేదం విధించారు. 10రెట్ల కంటే ఎక్కువ మంది సబ్ వే లో ఉన్నారు.ఆంక్షల వల్ల రెస్టారెంట్ల ఆదాయం పూర్తిగా దెబ్బతింటుందని, ముద్దులతో నిరసన తెలుపుతున్న ఓ ఆందోళన కారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. https://www.facebook.com/e1news/videos/421238892565139/