బీమా కంపెనీలకు మస్తు పైసలు

బీమా కంపెనీలకు మస్తు పైసలు

న్యూఢిల్లీ: ఎల్​ఐసీలో వాటా అమ్మకం ద్వారా రూ.22 వేల కోట్లు సేకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం మిగిలిన బీమా కంపెనీలకు క్యాపిటల్​ ఇన్​ఫ్యూజన్​ రూపంలో భారీగా ఆర్థికసాయం చేయనుంది. మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వాటి అవసరాల ఆధారంగా ప్రభుత్వం రూ. 3,000 నుంచి రూ.-5,000 కోట్ల వరకు అదనపు మూలధనాన్ని అందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో భారీగా మూలధనాన్ని కేటాయించాలని మోడీ సర్కారు భావిస్తోంది.  పోయిన ఆర్థిక సంవత్సరంలో, ప్రభుత్వం ఈ కంపెనీలకు రూ.5,000 కోట్ల వరకు  మూలధనాన్ని అందించింది. 2020–-21 ఫైనాన్షియల్​ ఇయర్​లో  రూ.9,950 కోట్లు ఇచ్చారు. వీటిలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.3,605 కోట్లు, నేషనల్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌కు రూ.3,175 కోట్లు,  ఓరియంటల్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌లో రూ.3,170 కోట్లు ఇచ్చారు. బలహీనంగా ఉన్న జనరల్​ బీమా కంపెనీలకు కిందటి ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున ఫండింగ్​ అందించారు. ఈ మూడు కంపెనీలు లాభాలు సాధించేలా చేయాలంటే మరింత క్యాపిటల్​ అందించడం తప్పనిసరని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీల పనితీరు ఆధారంగా రూ. 3,000 కోట్ల నుంచి- రూ.5,000 కోట్ల క్యాపిటల్‌ను అందించొచ్చని వివరించాయి. మరిన్ని నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే తన ఆథరైజ్డ్​ క్యాపిటల్​ను  పెంచిందని  తెలిపాయి.
 

ప్రపోజల్​ కోసం రిక్వెస్ట్​...
మూడు ప్రభుత్వ రంగ జనరల్​ బీమా సంస్థలకు సాల్వెన్సీ మార్జిన్‌‌‌‌‌‌‌‌  తక్కువగా ఉంది. కార్యాచరణ సామర్థ్యాలను (ఆపరేషనల్​ ఎఫీషియెన్సెస్​) మెరుగుపరచడానికి త్వరలో ఎక్స్​టెర్నల్​ కన్సల్టంట్​ను నియమించాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. జనరల్ ఇన్సూరర్స్ పబ్లిక్ సెక్టార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (జీఐపీఎస్​ఏ) ద్వారా, నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు బీమా సంస్థల్లో అవసరమైన మార్పులు చేయడానికి,  లాభాలను సాధించడానికి,  ఉద్యోగుల అభివృద్ధిని పెంచడానికి రిక్వెస్ట్​ఫర్​ ప్రపోజల్​ (ఆర్​ఎఫ్​సీ)ను జారీ చేశాయి. ‘‘పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు (పీఎస్​జీఐసీలు) రూపొందించిన కీలక పనితీరు సూచికల (కేపీఐలు)కు అనుగుణంగా పనితీరు సామర్థ్యాన్ని, లాభాలను పెంచడానికి, ఉద్యోగులకు మరింత మంచి చేయడానికి  సంస్థను పునర్నిర్మించే ప్రతిపాదన ఉంది” అని ఈ ఆర్​ఎఫ్​పీ తెలిపింది. కన్సల్టంట్లు బిడ్‌‌‌‌‌‌‌‌లు వేయడానికి చివరి తేదీ జూన్ 2, 2022. కేవలం న్యూ ఇండియా అస్యూరెన్స్ మాత్రమే స్టాక్ ఎక్స్ఛేంజీలలో అయింది. మిగిలిన మూడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఒక జనరల్​ బీమా కంపెనీని ప్రైవేటీకరించాలనే ఆలోచన తనకు ఉందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రైవేటైజేషన్​ను సులభతరం చేసేందుకు, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) యాక్ట్ (జీఐబీఎన్​)కు సవరణలను పార్లమెంట్ ఇది వరకే ఆమోదించిన విషయం తెలిసిందే.