పోలీసు ఉద్యోగులుగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు

పోలీసు ఉద్యోగులుగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు

గుజరాత్ సూరత్ లోని బర్డోలిలో GS RTC డ్రైవర్లు, కండక్టర్లు పోలీసుల విధులను నిర్వహిస్తున్నారు. బార్డోలీలో పోలీసుల సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. లాక్ డౌన్ సమయంలో.. స్టాప్ లేక పోవడం,ఉన్న వారిపైనే బాధ్యతలు ఎక్కువ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుంటున్నారు పోలీసులు.

లాక్ డౌన్ తో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడం…ఆ సంస్థకు సంబంధించిన సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ విజయ్ రబారీని పోలీసు అధికారులు సంప్రదించారు.  ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇందులో భాగంగా ఆర్టీసీ సిబ్బందికి పోలీసు శిక్షణ ఇచ్చామని తెలిపారు స్థానిక పోలీస్ అధికారి గిలాటర్. అంతేకాదు నగరంలో తిరిగేలా వారికి గుర్తింపు కార్డులను అందించామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులుగా పని చేసే తమకు… ఇప్పుడు పోలీసు విధులను నిర్వహిస్తుండటం కొత్తగా ఉందంటున్నారు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు. లాక్ డౌన్ సమయంలో విధులను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు.