రికార్డులెవెల్లో జీఎస్టీ వసూళ్లు

రికార్డులెవెల్లో జీఎస్టీ వసూళ్లు
  • గత నెల ఆదాయం రూ.1.24 లక్షల కోట్లు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి ఎక్కువ
  • నకిలీ ఇన్వాయిస్‌‌‌‌‌‌‌‌లను అడ్డుకోవడంతో పెరిగిన వసూళ్లు

న్యూఢిల్లీ: జీఎస్టీ ఆదాయం పెంచుకునేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ముఖ్యంగా నకిలీ ఇన్‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌లకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం, టైం ప్రకారం జీఎస్టీ వివరాలను వెల్లడించాలని రూల్‌‌‌‌‌‌‌‌ తేవడంతో వసూళ్లు పెరిగాయి. కరోనా వల్ల ఎకానమీ దెబ్బతిన్న సమయంలో ప్రభుత్వానికి రికార్డుస్థాయి ఆదాయం వచ్చింది. గత నెలలో ఏకంగా రూ.1.24 లక్షల కోట్ల జీఎస్టీ వసూలయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇంత భారీగా జీఎస్టీ వసూలు కావడం ఇదే మొదటిసారి. అన్ని సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్లు పూర్తయిన తరువాత కేంద్రానికి రూ.58,852 కోట్లు, రాష్ట్రాలకు రూ.69,559 కోట్లు వచ్చాయి. రాష్ట్రాలకు సీజీఎస్టీ చెల్లింపు కోసం కేంద్రం రూ.30 వేల కోట్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ‘‘గత నెల జీఎస్టీ రికార్డుస్థాయిలో వసూలయింది. అంతకుముందు సంవత్సరం మార్చితో పోలిస్తే ఈసారి ఆదాయం 27 శాతం పెరిగింది గత ఐదు నెలలుగా జీఎస్టీ వసూళ్లు బాగున్నాయి. జూన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 41 శాతం, సెప్టెంబరు క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఎనిమిది శాతం వసూళ్లు పెరిగాయి’’ అని ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ మినిస్ట్రీ తెలిపింది. డెలాయిట్‌ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ ఎంఎస్‌ మణి ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలూ జీఎస్టీ వసూళ్లను పెంచుకోగలిగాయని చెప్పారు. 

ఇవి హైలెట్స్‌‌‌‌‌‌‌‌

  • గత నెల జీఎస్టీ ఆదాయం రూ.1,23,902 కోట్లుకాగా, ఇందులో సెంట్రల్‌‌‌‌‌‌‌‌ జీఎస్టీ రూ. 22,973 కోట్లు,  స్టేట్‌‌‌‌‌‌‌‌ జీఎస్టీ రూ. 29,329 కోట్లు, ఐజీఎస్టీ రూ. 62,842 కోట్లు, సెస్ రూ. 8,757 కోట్లు  ఉన్నాయి. 
  • సీజీఎస్టీకి రూ.21,879 కోట్లు, ఐజీఎస్టీ నుంచి ఎస్‌‌‌‌‌‌‌‌జీఎస్టీకి రూ.17,230 కోట్లను రెగ్యులర్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం  రాష్ట్రాలు / యూనియన్‌‌‌‌‌‌‌‌ టెరిటరీలకు ఐజీఎస్టీ అడ్‌‌‌‌‌‌‌‌హాక్‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌గా రూ. 28 వేల కోట్లు కేటాయించింది.
  • జీఎస్టీ ఆదాయాలు గత ఆరు నెలలుగా  రూ.లక్ష కోట్లకుపైగానే రికార్డవుతున్నాయి. గత మార్చితో పోలిస్తే 2021 మార్చిలో దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు 70 శాతం పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో మొదటి, రెండో క్వార్టర్లలో జీఎస్టీ ఆదాయాలు వరుసగా 41 శాతం, ఎనిమిదిశాతం తగ్గాయి. మూడు, నాలుగో క్వార్టర్లలో ఇవి వరుసగా 8 శాతం, 14 శాతం పెరిగాయి. 
  • ఫేక్‌‌‌‌‌‌‌‌ ఇన్వాయిసింగ్‌ను అడ్డుకోవడానికి జీఎస్టీ, ఐటీ, కస్టమ్స్ ఆఫీసర్లు లేటెస్ట్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీలను ఉపయోగించారు. జీఎస్టీ వసూళ్లు ఇంతలా పెరగడం ఎకానమీ రికవరీకి సంకేతమని ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు చెబుతున్నారు.