చికెన్ బిర్యానీ గానీ, మటన్ బిర్యానీ గానీ వండటం ఎలాగో అందరికీ తెలుసు.. దాని టేస్ట్ కూడా తెలుసు.. లొట్టలేసుకుంటూ తింటుంటారు బిర్యానీ ప్రియిలు.. అంత టేస్ట్ గా ఉంటుందిమరీ.. ముఖ్యంగా మన హైదరాబాదీ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్..ధమ్ బిర్యానీ తింటుంటే ఆ కిక్కే వేరప్పా.. కానీ ఇటీవల కొత్తగా రివర్స్ బిర్యానీ బాగా పేమస్ అయింది.. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టేస్టీ వంటకాల్లో టాప్ 10 లో ఉంది.. ముఖ్యంగా మన భారతీయ వంటకం బటర్ చికెన్ తో పోటీ పడింది.. ఇంతకీ రివర్స్ బిర్యానీ అంటే ఏంటీ?.. ఎలా తయారు చేస్తారు ఫుల్ డిటెయిల్స్ మీకోసం..
ఇటీవల టేస్ట్ అట్లాస్ పోటీలు నిర్వహించి టాప్ 100 చికెన్ మీల్స్ ను టేస్టీ అట్లాస్ లిస్ట్ లో చేర్చింది. వాటిలో రివర్స్ బిర్యానీ కూడా టాప్ 10 లిస్టులో ఉంది. ఇది మన భారతీయ వంటకం అయిన బటర్ చికెన్ లో పోటీ పడింది.. ఈ రివర్స్ బిర్యానీని టర్కీ దేశపు అత్యుత్తమ వంటకం.. చాలా టేస్టీగా ఉంటుందట.. ఆ టేస్టే వేరప్పా అంటున్నారు భోజన ప్రియులు.
తయారీ ఎలా..?
మనం బిర్యానీ తయారు చేస్తే ఎలా చేస్తాం.. దీనికి పూర్తి విరుద్ధంగా రివర్స్ బిర్యానీని తయారు చేస్తారు. ఈ రెసీపీలో ప్రతి చికెన్ ముక్కలో బియ్యం, మసాలాలు నింపి వండుతారు. ఇది బటర్ చికెన్ అంత టేస్టీ అయిన వంటకం. ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సినవి. .
- 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నానబెట్టండి.
- 1 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి.
- 1 ఉల్లిపాయ తరిగినది
- 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు
- 1 టేబుల్ స్పూన్ నల్ల ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టండి
- అర టీస్పూన్ మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి ,మిరపకాయలు
- 1 స్పూన్ ఉప్పు
- అర కప్పు గోరువెచ్చని నీరు
చికెన్ కోసం
- 5 బోన్స్ లేని ఛాతీ భాగం చికెన్
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
- 1 స్పూన్ ఉప్పు
- 1 టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్
- 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్
గ్రేవీ (సాస్ )విషయానికొస్తే..
- 1 కప్పు గోరువెచ్చని నీరు
- 1 టేబుల్ స్పూన్ టమోటా పేస్ట్
- వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరపకాయ ముక్కలు
- ఉప్పు, నూనె కావలసినంత
తయారీ విధానం..
- చికెన్ తొడల(లెట్ పీస్) నుంచి బోన్స్ తీసివేసి మాంసాన్ని చదునుగా కట్ చేసుకోవాలి.
- ఒక పెద్ద గిన్నెలో చికెన్ పీస్ లను పెరుగు, ఉప్పు, మిరపకాయ ,నల్ల మిరియాలు కలిపి రిఫ్రిజిరేటర్‌లో 1-2 గంటలు నానబెట్టాలి.
- ఎండుద్రాక్షను నీటిలో 5 నిమిషాలు నానబెట్టి తరువాత వడకట్టాలి.
- బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నానబెట్టి తరువాత వడకట్టాలి
- ఒక పాన్ లో ఆలివ్ నూనె వేడి చేసి ఉల్లిపాయను వేయించాలి. పాన్‌లో బియ్యం వేసి వేయించాలి. పైన్ గింజలు, ఎండుద్రాక్ష ,సుగంధ ద్రవ్యాలు వేసి మరోసారి వేయించాలి. కొనసాగించండి. అర కప్పు వేడి నీటిని పోసి నీరు పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించాలి.
- తర్వాత చికెన్ పీస్ లను ఓ గిన్నెలో చర్మం క్రిందికి ఉంచి ప్రతి లెక్ పీస్ సమాన పరిమాణంలో బియ్యం ఫిల్లింగ్‌తో నింపి కప్పివేయాలి.
- గిన్నెను జాగ్రత్తగా తలక్రిందులుగా చేసి చికెన్ పీస్ లను బేకింగ్ ట్రేలోకి బదిలీ చేయాలి. సాస్ కోసం పైన ఇచ్చిన అన్ని పదార్థాలను కలపాలి. దీనిని చికెన్ పీస్ ల మీద పోయాలి.
- 200 డిగ్రీల సెల్సియస్ (392 డిగ్రీల ఫారెన్‌హీట్) దగ్గర ముందుగా వేడిచేసి పెట్టిన ఓవెన్‌లో బేకింగ్ ట్రేని ఉంచి 30 నిమిషాలు ఉడికించాలి.
- తరువాత ట్రేని పై నుంచి రెండో రాక్‌కి దించి మరో 20 నిమిషాలు లేదా పైభాగం చక్కగా బ్రౌన్ అయ్యే వరకు బేక్ చేయాలి. చికెన్ టాప్కాపీ రెడీ.. అదేనండి మన రివర్స్ బిర్యానీ రెడీ.
