ఫిబ్రవరి నెల GST కలెక్షన్స్ 12.5 శాతం పెరిగాయ్

ఫిబ్రవరి నెల GST కలెక్షన్స్ 12.5 శాతం పెరిగాయ్

ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు 12.5 శాతం పెరిగి రూ. 1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతేడాది(2023) తో పోలిస్తే.. మొత్తం 1లక్షా 68వేల 337 కోట్ల రూపాయల స్థూల జీఎస్ టీ ఆదాయం వచ్చిందని ఆదివారం(మార్చి3) ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2023నుంచి ఫిబ్రవరి 2024) మొత్తం స్థలూ GST సేకరణ రూ. 18.40 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి మోప్ అప్ కంటే 11.7 శాతం ఎక్కువ.  గత ఫిబ్రవరిలో రూ. 1.50 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు అయింది. దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ లో 13.39 శాతం పెరుగుదల, వస్తువుల దిగుమతి నుంచి జీఎస్టీ 8.5 శాతం పెరుగుదలతో ఈ వృద్ధిని సాధించింది.