జీఎస్టీ వసూళ్లు రూ.2.03 లక్షల కోట్లు.. సెప్టెంబర్ లో 14.7 శాతం పెరుగుదల

జీఎస్టీ వసూళ్లు రూ.2.03 లక్షల కోట్లు.. సెప్టెంబర్ లో 14.7 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: దిగుమతులు,  దేశీయ వినియోగం భారీగా పెరగడంతో గత నెల జీఎస్​టీ వసూళ్లు 14.7 శాతం పెరిగి రూ.2.03 లక్షల కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.2 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ఇది మూడోసారి. గతంలో ఏప్రిల్ లో రూ.2.43 లక్షల కోట్లు, జులైలో రూ.2.11 లక్షల కోట్ల చొప్పున రాబడులు వచ్చాయి. సెప్టెంబర్​లో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన వసూళ్లు 10.1 శాతం వృద్ధి చెంది రూ.1.38 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతుల ద్వారా వచ్చే పన్ను ఆదాయం ఏకంగా 26 శాతం పెరిగి రూ.65,525 కోట్లకు పెరిగింది. రీఫండ్లను మినహాయించిన తర్వాత నికర జీఎస్​టీ వసూళ్లు 18.1 శాతం పెరిగి రూ.1.76 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.