జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కాంపెన్సేషన్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ ఇంకో 4 ఏళ్ల వరకు!

జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కాంపెన్సేషన్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ ఇంకో 4 ఏళ్ల వరకు!

న్యూఢిల్లీ: లగ్జరీ, డీమెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (పొగాకు, మద్యం వంటివి) ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లపై వసూలు చేస్తున్న జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కాంపెన్సేషన్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ను  మార్చి 31, 2026 వరకు వసూలు చేయాలని జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్‌‌‌‌‌‌‌‌టీ అమలు చేయడం వలన రాష్ట్రాలకు వచ్చే రెవెన్యూ లాస్‌‌‌‌‌‌‌‌ను ఐదేళ్ల వరకు భర్తీ చేస్తామని కేంద్రం ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై నుంచి రాష్ట్రాలకు  కాంపెన్సేషన్‌‌‌‌‌‌‌‌ చెల్లించడం ఉండదు. కానీ, 2020–21, 2021–22 లలో రాష్ట్రాలకు జీఎస్‌‌‌‌‌‌‌‌టీ పరిహారం చెల్లించడానికి అప్పులు చేశామని, ఈ అప్పులు తీర్చేందుకే జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కాంపెన్సేషన్ సెస్‌‌‌‌‌‌‌‌ను ఇంకో నాలుగేళ్ల పాటు కొనసాగించనున్నామని  ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌  నాయకత్వంలోని జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కౌన్సిల్ ప్రకటించింది.  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కాంపెన్సేషన్‌‌‌‌‌‌‌‌ సెస్‌‌‌‌‌‌‌‌ను వేయడం ఈ నెల 30 తో ఆపేయాలి.   కాగా, రాష్ట్రాలకు జీఎస్‌‌‌‌‌‌‌‌టీ పరిహారాన్ని చెల్లించడానికి 20‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20–21 లో రూ. 1.1 లక్షల కోట్లను, 2021–22 లో రూ. 1.59 లక్షల కోట్లను కేంద్రం అప్పు చేసింది. ఈ అప్పులపై వడ్డీ కింద 2021–22 లో రూ. 7,500 కోట్లను, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 14,000 కోట్లను చెల్లించింది.