మిల్లెట్స్​పై 5 శాతమే జీఎస్​టీ

మిల్లెట్స్​పై  5 శాతమే జీఎస్​టీ

మొలాసిస్​పైనా తగ్గింపు
మిల్లెట్స్​, చెరకు రైతులకు ఊతం
కార్పొరేట్​ గ్యారంటీపై డైరెక్టర్లకు మినహాయింపు
జరీపై జీఎస్​టీ తగ్గింపు
52 వ జీఎస్​టీ కౌన్సిల్​ నిర్ణయం


న్యూఢిల్లీ: మిల్లెట్స్‌​ ప్రొడక్టులపై జీఎస్​టీని ఇప్పుడున్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఫలితంగా మిల్లెట్స్‌ (చిరు ధాన్యాల) వినియోగం ఊపందుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.  దేశంలోని చెరకు రైతులకు ఊరట కలిగేలా మరోవైపు మొలాసిస్​పై వేస్తున్న 28 శాతం జీఎస్​టీని 5 శాతంగా మార్చారు. ప్యాకేజ్డ్​ లేదా ప్రీ ప్యాకేజ్డ్​ పిండిలో 70 శాతం దాకా చిరు ధాన్యాల శాతం ఉంటే 5 శాతమే జీఎస్​టీ వర్తిస్తుందని జీఎస్​టీ కౌన్సిల్​ ప్రకటించింది.  జీఎస్​టీ  కౌన్సిల్​52 వ మీటింగ్ శనివారం​ న్యూఢిల్లీలో జరిగింది. అంతేకాదు ఇంకొక గుడ్​న్యూస్​ కూడా కౌన్సిల్ ప్రకటించింది. 

లూజ్​గా అమ్మే మిల్లెట్స్‌​ ఫ్లోర్​ను జీఎస్​టీ నుంచి మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. పౌష్టిక ఆహారంగా పేరొందిన మిల్లెట్స్‌ ఇటీవలి కాలంలో ప్రాచుర్యం సంపాదించుకున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఆరోగ్యంపై దేశ ప్రజలలో అవగాహన, ఆసక్తి పెరగడమే దీనికి కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రజలకు పౌష్టిక విలువలు ఎక్కువగా ఉండే మిల్లెట్స్‌​ ప్రొడక్టులు మరింత విరివిగా చేరువ కావాలనే ఉద్దేశంతోనే జీఎస్​టీని భారీగా తగ్గించాలని నిర్ణయించారు. 

2023 ను ఇంటర్నేషనల్​ ఇయర్​ ఆఫ్​ మిల్లెట్స్‌​గా ప్రభుత్వం  ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో దేశంలో మిల్లెట్స్‌​ ఉత్పత్తి​, వినియోగం ​రెండూ బాగా పెరుగుతాయని కేపీఎంజీ నేషనల్​ హెడ్​ (ఇండైరెక్ట్​ ట్యాక్స్​) అభిషేక్​ జైన్​ వెల్లడించారు.

ఈఎన్​ఏపై 18 శాతం జీఎస్​టీ....

ఎక్స్​ట్రా న్యూట్రల్​ ఆల్కహాల్​ (ఈఎన్​ఏ) పై 18 శాతం జీఎస్​టీ విధింపు కోసం ఒక సవరణను సైతం జీఎస్​టీ కౌన్సిల్​ ఆమోదించింది. కానీ, మనుషులు వాడే డిస్టిల్డ్​ ఆల్కహాల్​పై  జీఎస్​టీ విధించరాదని (మినహాయింపు) ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ నాయకత్వంలోని జీఎస్​టీ కౌన్సిల్​ నిర్ణయించింది. ఇండస్ట్రియల్​ అవసరాల కు వాడే ఈఎన్​ఏపై జీఎస్​టీ కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

ఈఎన్​ఏపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని, దానిపై పన్ను విధించే అధికారం జీఎస్​టీ కౌన్సిల్​, కేంద్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందని ఇటీవల అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు మీడియాకు నిర్మలా సీతారామన్​ వివరించారు. అయితే, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలి పెట్టాలని కౌన్సిల్​ మీటింగ్​లో నిర్ణయించినట్లు ఫైనాన్స్​ మినిస్టర్​ వెల్లడించారు. 

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలే పన్ను విధించాలనుకుంటే తాము దానిని స్వాగతించనున్నట్లు పేర్కొన్నారు. అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చినా, దానిని పక్కకి పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకే పన్ను విధింపు అధికారం ఇవ్వడం కో–ఆపరేటివ్​ ఫెడరలిజం​కు స్ఫూర్తిని ఇస్తుందని డెలాయిట్​ ఇండియా పార్ట్​నర్​ మణి చెప్పారు. ఆల్కహాల్​పై పన్ను విధింపును రాష్ట్రాలకు అప్పచెప్పడంతో పాటు, మొలాసిస్​పై రేట్లను రేషనలైజ్​ చేయడం శుభపరిణామమని ఆల్కహాల్​ ఇండస్ట్రీ సంతోషం వ్యక్తం చేస్తోంది.

రైల్వే సర్వీసులపై ఫార్వార్డ్​ ఛార్జ్​ మెకానిజమ్​..

ఇన్​పుట్​ ట్యాక్స్​  క్రెడిట్​  పొందేందుకు  వీలుగా రైల్వేలు ఇచ్చే సర్వీసులు, సప్లయ్​చేసే గూడ్స్​(వస్తువుల)పై ఫార్వార్డ్​ చార్జ్​ మెకానిజమ్​ అమలు చేయాలని జీఎస్​టీ కౌన్సిల్​ నిర్ణయం తీసుకుంది. జరీపై 5 శాతం..మెటలైజ్డ్​ పాలియెస్టర్​ ఫిల్మ్​ లేదా ప్లాస్టిక్​ ఫిల్మ్​ నుంచి తయారు చేసే జరీ దారం (థ్రెడ్​)పై జీఎస్​టీని కూడా 5 శాతానికి తగ్గించారు. బార్లీని మాల్ట్​గా మార్చే జాబ్​ వర్క్​పైనా జీఎస్​టీని 18 శాతం నుంచి  అయిదు శాతంగా మార్చారు.

కంపెనీ డైరెక్టర్ల కార్పొరేట్ ​గ్యారంటీలకు నో జీఎస్టీ 

కార్పొరేట్​, పర్సనల్​ గ్యారంటీలపై జీఎస్​టీ విధింపు మొదటి నుంచీ కన్​ఫ్యూజన్​కు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్​టీ కౌన్సిల్​ క్లారిటీ తీసుకొచ్చింది. హోల్డింగ్​ కంపెనీ ఇచ్చే కార్పొరేట్​ గ్యారంటీపై 18 శాతం జీఎస్​టీ యదాతథంగా కొనసాగుతుందని, కానీ, కంపెనీ డైరెక్టర్లు ఇచ్చే కార్పొరేట్​ గ్యారంటీకి మాత్రం జీఎస్​టీ  మినహాయింపు ఉంటుందని స్పష్టత ఇచ్చింది.

చెరకు రైతుల కోసం..

మొలాసిస్​పై జీఎస్​టీ రేటును 5 శాతానికి తగ్గించాలనే ప్రపోజల్​కు కూడా కౌన్సిల్​ ఆమోదం తెలిపింది. ఇప్పటిదాకా మొలాసిస్​పై 28 శాతం జీఎస్​టీ అమలవుతోంది. ఈ తగ్గింపు వల్ల చక్కెర మిల్లుల లిక్విడిటీ మెరుగుపడుతుందని, ఫలితంగా రైతులకు చెరకు బకాయిలు చెల్లించ డం ఈజీ అవుతుందని కౌన్సిల్​ ఒక స్టేట్​మెంట్లో పేర్కొంది. పశువుల దాణా తయారీలో మొలాసి స్​ ప్రధానమైన ముడిసరుకు. అంటే, దాణా తయారీ ఖర్చు తగ్గేందుకూ దారి ఏర్పడుతుంది.