GT vs SRH: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. క్లాసెన్ కోసం స్పిన్నర్‌ను దించిన గుజరాత్

GT vs SRH: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. క్లాసెన్ కోసం స్పిన్నర్‌ను దించిన గుజరాత్

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి పోరులో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోనీ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ సారథి పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, గుజరాత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. భీకర ఫామ్‌లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ ను కట్టడి చేయడానికి ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ను జట్టులోకి తీసుకుంది.   

ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం. రెండు జట్లు ఇప్పటికే చెరో రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఒకదాంట్లో ఓడిపోయి, మరో దాంట్లో విజయం సాధించాయి.

తుది జట్లు

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే.

హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్.