ఇస్లామాబాద్ లో భారత్ ఇఫ్తార్ విందు.. వేధించిన పాక్ పోలీసులు

ఇస్లామాబాద్ లో భారత్ ఇఫ్తార్ విందు.. వేధించిన పాక్ పోలీసులు

పాకిస్తాన్ లో భారత అధికారులు ఇచ్చిన ఇఫ్తార్ విందుకు వచ్చిన అతిథులను అవమానించారు అక్కడి పోలీసులు. రంజాన్ మాసం ముగుస్తుండటంతో.. నిన్న ఇస్లామాబాద్ లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇందుకు ఇతర దేశాల డిప్లమాట్స్ తో పాటు, పాక్ కు చెందిన జర్నలిస్టులను, రాజకీయ నాయకులను ఆహ్వానించారు. అయితే ఇఫ్తార్ కు వచ్చినవారితో పాకిస్తానీ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇఫ్తార్ విందు క్యాన్సిల్ అయిందని చెప్పి కొంతమందిని వెనక్కి పంపించారు. మరికొంత మందిని దూషించారు. ఈ విషయంపై ఇస్లామాబాద్ లోని ఇండియన్ హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ లేఖ రాసింది. ఇఫ్తార్ కు వచ్చిన అతిధులతో అమర్యాదకరంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మామూలుగా చేసే తనిఖీల కంటే ఎక్కువగా చెకింగ్ లు చేశారని అన్నారు జర్నలిస్టులు. ఇన్విటేషన్ కార్డు ఉన్నా, ప్రశ్నలతో పాక్ పోలీసులు  విసిగించారని తెలిపారు. ఇందుకు గాను మెహ్రీన్ జహ్రామాలిక్ అనే జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. విందు ఏర్పాటు చేసిన హోటల్ లోకి వెళ్తుండగా పాక్ యాంటీ టెర్రరిజం ఫోర్స్ అసభ్యకరంగా ప్రవర్తించిందని అన్నారు. తన డ్రైవర్ ను దూషించారని అన్నారు.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నేత ఫర్హతుల్లా బాబర్ ను కూడా పాక్ పోలీసులు వేధించారు. హోటల్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. విందు క్యాన్సిల్ అయినట్లు తెలిపారు. గట్టిగా ప్రశ్నించడంతో.. మరో గేటు నుంచి వెళ్లమని చెప్పారు. అయినా ఆ గేటు మూసి ఉంది. దీంతో మళ్లీ మొదటి గేటునుంచే ఆయన హోటల్ లోపలికి వెళ్లారు. ఇందుకు గాను బాబర్ తన అసహనాన్ని ట్విట్ చేశారు.

అయితే పాక్ పోలీసులు కల్పించిన అసహనానికి ఇఫ్తార్ వింధుకు వచ్చిన అతిథులకు క్షమాపణలు చెప్పారు భారత కమిషనర్ అజయ్ బిసారియా.

https://twitter.com/ANI/status/1135027486150938630/photo/1