GHMC ఎన్నికల ప్రచారంలో పాటించాల్సిన మార్గదర్శకాలు

GHMC ఎన్నికల ప్రచారంలో పాటించాల్సిన మార్గదర్శకాలు

తెలంగాణ ఎన్నికల సంఘం  GHMC ఎన్నికల ప్రచారంలో మార్గదర్శకాలను విడుదల చేసింది. రెండు వాహనాలతో కాన్వాయ్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు భౌతిక దూరం తప్పని సరిగా పాటించాలని స్పష్టం చేసింది. భద్రతా సిబ్బంది మినహా ఐదుగురు సభ్యుల టీం కు మాత్రమే ఇంటింటి ప్రచారం నిర్వహించుకునే అనుమతినిచ్చింది. పార్టీల అభ్యర్థుల రోడ్ షోలకు మధ్య కనీసం అర్ధగంట విరామం ఉండాలంది. బహిరంగ సభలకు అనుమతి లేదని..రోడ్ షోల్లోనూ కరోనా రూల్స్ పాటించాలని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించని పార్టీలపై చర్యలు తప్పవంది ఎన్నిక కమిషన్.