
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌లోని గచ్చి బౌలి స్టేడియంలో 3,782 మంది కళాకారులు 7 నిమిషాల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనతో గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడి యంలో ఆదివారం భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 3 వేలకుపైగా కళాకారులు జెనుత శబ్ధం ఆధారంగా ఏడు నిమిషాల పాటు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించా రు. ఈ కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించినట్లు గిన్నీస్ బుక్ ప్రతినిధి రిషిత్నాథ్ ప్రకటిం చారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణరావు చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. తమ ప్రభుత్వం అన్ని రంగాలతోపాటు కళారంగాన్ని కూడా ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో భారత్ ఆర్ట్ అకాడమీ ప్రెసిడెంట్ రమణరావు, లలితరావు పాల్గొన్నారు.