అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .. నిందితుల వద్ద 12 బైక్లు సీజ్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .. నిందితుల వద్ద 12 బైక్లు సీజ్
  • ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్​ మహాజన్​ వెల్లడి

ఆదిలాబాద్​టౌన్​(జైనథ్​), వెలుగు: అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి, 12 బైక్ లను సీజ్ చేశారు. ఎస్పీ అఖిల్​మహాజన్​గురువారం జైనథ్​ పోలీస్​స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. జైనథ్​కు చెందిన మద్దులవార్ రమేశ్ తన బైక్​ చోరీ అయిందని కొద్ది రోజుల కింద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా బేల మండలానికి చెందిన బైక్​మెకానిక్​సుమిత్​సకర్కార్​ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని ఫ్రెండ్స్ షేక్​ షకిల్, మరో బాలుడితో పాటు మహారాష్ట్రకు చెందిన కృష్ణతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 

ఆదిలాబాద్, బేల, జైనథ్, కోర్పణ మండలాల్లో బైక్​చోరీలు చేసి.. వాటి ఇంజన్లు మారుస్తూ ఇతరులకు అమ్ముతున్నారు. నిందితులు సుమిత్​ సకర్కర్​, కృష్ణ తాన్భా నఖతే, షేక్​ షకీల్​ను, కొనుగోలు చేసిన అబ్రార్​ఖాన్, షేక్​ ఇబ్రహీ హాజీమియా, సాయిలను అరెస్ట్ చేశారు. సలీమ్​, బాలుడు పరారీలో ఉన్నట్టు చెప్పారు.  కేసును ఛేదించిన జైనథ్ సీఐ డి.సాయినాథ్, ఎస్ఐ గౌతమ్, సిబ్బంది వికాస్, నరేశ్​ను ఎస్పీ అభినందించారు.