
మరికల్, వెలుగు: మండలంలోని కోయిల్‌సాగర్ ప్రధాన కుడికాలువ నుంచి వచ్చే డీ19 కాలువ, 5వ తూము వద్ద గురువారం తెల్లవారుజామున గండి పడడంతో సాగు నీళ్లన్ని పొలాల్లోకి వృథాగా పోతున్నాయి. కాలువ పక్కనున్న రైతు వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు మరికొందరు వచ్చి కాలువకు పడిన గండి పూడ్చడానికి ప్రయత్నించారు.
రాళ్లు, వరిగడ్డి వేసి రంద్రాన్ని పూడ్చారు. అయినా నీళ్లు బయటకు వస్తున్నాయని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చిన వారు స్పందించడం లేదన్నారు. 8 ఎకరాల పొలంలో వడ్లు చల్లుకున్నట్లు చెప్పారు. బందాల్లోకి నీళ్లు రావడంతో రూ.50 వేలు నష్టపోయానని రైతు వాపోయారు. అధికారులు స్పందించి కాలువను బాగు చేయాలని కోరారు.