అత్యంత పొడవాటి చెవి వెంట్రుకలకు గిన్నిస్ రికార్డ్

అత్యంత పొడవాటి చెవి వెంట్రుకలకు గిన్నిస్ రికార్డ్

కొన్ని కొన్నిసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ వాళ్లు ప్రకటించే రికార్డ్స్ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇంకొన్నిసార్లు వింతగా అనిపిస్తుంటాయి. అలాంటి వింతైన రికార్డ్ నెలకొల్పాడు తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన రిటైర్డ్ గవర్నమెంట్ స్కూల్ హెడ్‌మాస్టర్ ఆంటోనీ విక్టర్‌‌. ప్రపంచంలోనే అత్యంత పొడవాటి చెవి వెంట్రుకలు కలిగిన మనిషిగా ఆయన రికార్డుకెక్కాడు. 

2007లో పొడవైన చెవి వెంట్రుకలు కలిగిన మనిషిగా ఆంటోనీ పేరుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చేర్చారు. అయితే, ఇప్పటికీ అవి చెక్కు చెదరలేదు. 7.12 ఇంచులు (18.1 సెంటీమీటర్లు) ఉన్న అతని చెవి వెంట్రుకలకి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘ఇప్పటి నుంచి ఈ రికార్డ్‌ను చెరిపేయడమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకుంటా’ అని కొందరు.. ‘చెవులు అయిపోయాయి, ఇప్పుడు ముక్కు వెంట్రుకలకి రికార్డ్ ఇస్తార’ని, ‘గురువుని మించిన శిష్యున్ని అవుతాం’ అంటూ ఇంకొందరు వ్యంగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు.