12 అడుగుల భారీ మొసలి.. పొలంలోకి వచ్చింది  

12 అడుగుల భారీ మొసలి.. పొలంలోకి వచ్చింది  

గ్రామ సరిహద్దులోని పొలాల్లోకి ప్రవేశించిన ఓ భారీ మొసలిని పట్టుకున్నారు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు.  దాదాపు 4 గంటల పాటు దాన్ని పట్టుకోవడానికి శ్రమించారు. చివరకు ఎలాగోలా బంధించి అటవీ శాఖకు అప్పగించారు.

గుజరాత్ రాష్ట్రం వడోదరలోని రావల్ అనే గ్రామంలో జరిగిందీ సంఘటన. ఓ 12 అడుగుల మొసలి అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడంతో.. వారు దగ్గరలోని వన్యప్రాణి సంరక్షకులకు సమాచారమిచ్చారు. వారితో పాటు కొందరు యువకులు దాన్ని పట్టుకొని వాఘోడియా అటవీ పరిధిలోని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కి అప్పజెప్పారు.

శనివారం ఉదయం 10.30 గంటలకు .. ఒక పొలంలో భారీ మొసలి ఉన్నట్లు తమకు కాల్ వచ్చిందని,  అక్కడికి వెళ్లి ఆ మొసలిని పట్టుకోవడానికి దాదాపు నాలుగు గంటలు పట్టిందని హేమంత్ వాధ్వానా అనే వైల్డ్ లైఫ్ యాక్టివిస్ట్  అన్నారు. దగ్గరలోని అజ్వా అనే రిజర్వాయర్‌కి అనుసంధానమై ఉన్న కాలువ నుండి ఈ మొసలి పొలంలోకి ప్రవేశించి ఉండవచ్చని ఆయన అన్నారు.