
- బాగుందన్న గుజరాత్ బృందం
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: మజీద్పూర్ ప్రభుత్వ పాఠశాలను తాము ఆదర్శంగా తీసుకుంటామని గుజరాత్ విద్యాధికారుల బృందం చెప్పింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లోని మజీద్ పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలను 78 మందితో కూడిన గుజరాత్ ఎడ్యుకేషన్ టీం శుక్రవారం సందర్శించింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీతో ఇంటరాక్ట్ అయ్యారు. ఇక్కడి స్టడీ, పరిశుభ్రత, టీచర్ల పనితీరును చూసి సంతోషించారు. ఇక్కడి స్కూళ్లకు కమ్యూనిటీ సపోర్ట్ బాగుందని అన్నారు.
‘ఇంటికి వంద – బడికి చందా’ కార్యక్రమం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు,స్టేట్ కమ్యూనిటీ మొబిలిటీ ఆఫీసర్ జోసెఫ్, స్కూల్ ప్రిన్సిపాల్ విజయభాస్కర్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.