రెండు పార్టీలు ‘ఐ లవ్యూ’ చెప్పుకుంటున్నాయి: కేజ్రీవాల్

రెండు పార్టీలు ‘ఐ లవ్యూ’ చెప్పుకుంటున్నాయి: కేజ్రీవాల్

కమలం పార్టీపై   ఆప్, కాంగ్రెస్​ పోటాపోటీ విమర్శలు  

బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నయ్: కేజ్రీవాల్

బీజేపీకి బీటీమ్‌‌‌‌ మాదిరి ఆప్: కాంగ్రెస్ పార్టీ ఆరోపణ

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ఒకవైపు.. పవర్‌‌‌‌‌‌‌‌లోకి రావాలని పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్న కాంగ్రెస్‌‌‌‌ ఇంకోవైపు.. కొత్తగా రేసులోకి వచ్చిన ఆప్ మరోవైపు.. నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారంలోకి దిగాయి. అయితే బీజేపీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, ఆప్.. కాస్త విచిత్రపు ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీకి.. నువ్వు బీటీమ్ అంటే నువ్వు బీటీమ్ అంటూ విమర్శలు చేసుకుంటున్నాయి. ఆప్ అభ్యర్థులను బీజేపీ నిర్ణయిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ క్యాండిడేట్లకు బీజేపీ ఫండింగ్ చేస్తున్నదని ఆప్ అంటున్నది. దీంతో ప్రచారం అప్పుడే హీటెక్కింది.

బీజేపీకి భార్యలా కాంగ్రెస్: కేజ్రీవాల్

గుజరాత్‌‌‌‌లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పని చేస్తున్నాయని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీకి భార్యలా కాంగ్రెస్ మారిందని, రెండు పార్టీలు ‘ఐ లవ్యూ’లు చెప్పుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ‘‘అమిత్ షా ఇంటర్వ్యూ ఒకటి చూశాను. బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉందని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ కూడా అందుకు తగ్గట్లుగా ఆడుతున్నది. ఆ పార్టీ లీడర్లు బీజేపీ జేబు మనుషుల్లా మారిపోయారు” అని విమర్శించారు.

27 ఏండ్ల బీజేపీ పాలనలో గుజరాత్ ప్రజలు విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఆప్ లీడర్లను టీవీ డిబేట్లకు పిలవొద్దని అన్ని చానల్స్‌‌‌‌ను బీజేపీ భయపెడుతున్నదని ఆరోపించారు. ‘‘న్యూస్ చానల్స్‌‌‌‌లో మనీశ్ సిసోడియాపై డిబేట్లు పెడతారు. కానీ అక్కడ మాట్లాడేందుకు ఆప్ ప్రతినిధులను రానివ్వరు. కేవలం బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే.. ఈ భార్యాభర్తలు/సోదర సోదరీమణుల సంబంధం ఇప్పుడు బహిర్గతమైంది’’ అని చెప్పారు.

కాంగ్రెస్ అభ్యర్థులు బీజేపీతో టచ్‌‌‌‌లో ఉన్నారని ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదన్ గాధ్వి ఆరోపించారు. ‘‘కాంగ్రెస్ టికెట్‌‌‌‌పై పోటీ చేయాలని, తాను డబ్బులిస్తామని వాళ్లకు బీజేపీ చెప్పింది. ఒక వేళ వాళ్లు గెలిస్తే.. బీజేపీలోకి వెళ్లిపోతారు. ఆప్‌‌‌‌ను ఓడించాలి.. లేదా ఓట్లను చీల్చాలనే కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నిస్తున్నారు” అని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులకూ బీజేపీ ఫండింగ్ చేస్తున్నదని కేజ్రీవాల్ కూడా ఆరోపించారు. గుజరాత్‌‌‌‌లో బీజేపీ, కాంగ్రెస్ ఒకవైపు.. ఆప్ ఒకవైపు ఉండి పోటీ చేస్తున్నాయని చెప్పారు. 

ఆప్ అభ్యర్థుల జాబితా బీజేపీ ఇస్తది: కాంగ్రెస్

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఆప్ పని చేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ఆప్ అభ్యర్థులను బీజేపీనే నిర్ణయిస్తున్నదని చెప్పుకొచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్‌‌‌‌గురు.. శుక్రవారం ఆప్‌‌‌‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌‌‌‌లో చేరారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘గెలిచే అవకా శం ఉన్న 15 మంది ఆప్‌‌‌‌ లీడర్లకు టికెట్లు ఇవ్వాలని అడిగాను. కానీ ఎన్నికల్లో బీజేపీకి సాయం చేసే వాళ్లకే టికెట్లు ఇస్తున్నారు.

బీజేపీని ఓడించాలనే ఉద్దేశంతో నేను ఆప్‌‌‌‌లో చేరాను. కానీ బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్సే సరైన పార్టీ” అని చెప్పారు. అక్టోబర్ 1న చార్టర్డ్ విమానంలో రాజ్‌‌‌‌కోట్‌‌‌‌కు వచ్చిన ఆప్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్.. బ్యాగుల్లో డబ్బు తెచ్చారని ఆరోపించారు. అంత డబ్బు ఎక్కడిదని అడగ్గా.. ‘విమానంలో వచ్చింది’ అని సైగ చేశారని చెప్పారు. ‘‘బీజేపీ, ఆప్ కలిసి పని చేస్తున్నాయి. కేంద్రానికి తెలియకుండా చార్టర్డ్ విమానంలో అంత డబ్బును ఎలా తీసుకురాగలరు” అని గుజరాత్ ఏఐసీసీ ఇన్‌‌‌‌చార్జ్ రఘుశర్మ ఆరోపించారు. బీజేపీకి బీటీమ్‌‌‌‌ మాదిరి ఆప్ పని చేస్తోందని మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు.

మళ్లీ బీజేపీనే!

గుజరాత్‌‌‌‌ ప్రజలు మరోసారి బీజేపీ కే పట్టంకట్టబోతున్నారని ‘ఏబీపీ సీ ఓటర్’ నిర్వహించిన ఒపీనియ న్ పోల్స్‌‌‌‌లో వెల్లడైంది. సర్వేలో 50 శాతం మంది అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆప్‌‌‌‌కు 20 శాతం మంది, కాంగ్రెస్‌‌‌‌కు 17 శాతం మంది మద్దతు తెలిపారు. పంజాబ్ సక్సెస్ తర్వాత గుజరాత్‌‌‌‌పై కన్నేసిన ఆప్‌‌‌‌కు.. రెండో స్థానం దక్కింది. సర్వేలో భాగంగా 22,807 మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు.