గుజరాత్‌ డ్రగ్స్‌కు కేంద్రంగా మారింది

గుజరాత్‌ డ్రగ్స్‌కు కేంద్రంగా మారింది

గుజరాత్‌ డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. గుజరాత్‌ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌లో పర్యటించిన  రాహుల్ ఈ  కామెంట్స్ చేశారు. " గుజరాత్‌ డ్రగ్స్‌కు కేంద్రంగా మారింది. ముంద్రా పోర్టు నుంచి డ్రగ్స్‌ను తరలిస్తున్నారు కానీ ఇక్కడున్న  బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది గుజరాత్‌ మోడల్‌. ’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

గుజరాత్‌ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  వస్తే... రైతులకు రూ. 3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అంతేకాకుండా... రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. అటు రూ. 500 కే  గ్యాస్ సిలిండర్లను అందిస్తామని  రాహుల్ చెప్పారు. 

కరోనా మహమ్మారి సమయంలో మరణించిన  బాధితుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని  ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు., ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వేల పాఠశాలలను మూసివేసిందని, తాము అధికారంలోకి రాగానే, 3,000 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను తెరిచి, బాలికలకు ఉచిత విద్యను అందిస్తామని రాహుల్ చెప్పారు.