గుజరాత్ అసలైన ఆట ఇంకా ఆడలేదు: జేసన్ హోల్డర్

గుజరాత్ అసలైన ఆట ఇంకా ఆడలేదు: జేసన్ హోల్డర్

అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ జట్టు ఇంకా తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉందని, అయినప్పటికీ విజయాలు సాధిస్తూ ఐపీఎల్ ప్లే-ఆఫ్ రేసులో నిలవడం సంతోషకరమని జేసన్ హోల్డర్ అభిప్రాయపడ్డారు. పంజాబ్ కింగ్స్‌‌పై నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హోల్డర్.. ప్రతి విజయం వ్యక్తిగత ప్రతిభపై కాకుండా జట్టు సమష్టి కృషితో దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. 

" మా ఆటతీరులో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతిరోజూ ఒక్కరే రాణించడం లేదు. వేర్వేరు రోజుల్లో వేర్వేరు ఆటగాళ్లు జట్టును ముందుకు నడిపిస్తున్నారు" అని హోల్డర్ పేర్కొన్నారు. " మేము ఇంకా పూర్తిస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చేయలేదని భావిస్తున్నాను. కానీ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ అవసరమైన రెండు పాయింట్లు సాధించడం విశేషం" అని ఆయన చెప్పారు.