కల్తీ మద్యం తాగి 28 మంది కూలీలు మృతి

కల్తీ మద్యం తాగి 28 మంది కూలీలు మృతి

గుజరాత్ లో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 28 మంది చనిపోయినట్లు తెలిపారు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా. బొటాడ్ జిల్లా, రోజిడ్ గ్రామంలో కల్తీ మద్యం విక్రయిస్తున్నారు. రోజిడ్ సహా చట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరు ఆదివారం రాత్రి అనారోగ్యంతో.. ప్రభుత్వ హాస్పిటల్స్ లో చేరారు. సోమవారం ఉదయమే ఇద్దరు చనిపోగా.. మరికొందరు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీకూలీలు ఉన్నారన్నారు అధికారులు.

ధందుక, భావ్ నగర్, బోటాడ్ జిల్లాల్లోని హాస్పిటల్స్ లో కల్తీ మద్యం తాగి అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం భావ్ నగర్ నుంచి ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని రోజిడ్ గ్రామానికి పంపించింది. దీనిపై విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేసింది గుజరాత్ ప్రభుత్వం. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు డాక్టర్లు. కాగా... వాటర్ తో కలిపిన కెమికల్ ను 600 మందికి విక్రయించి 40 వేలు వసూలు చేశారని తెలిపారు గుజరాత్ డీజీపీ.