
గుజరాత్‌కు చెందిన ఓ గ్యాంగ్ హైదరాబాద్ వ్యాపారీకి టోకరా వేసింది. భారీ సంఖ్యలో ఐ ఫోన్లు కావాలని జగదీష్ మార్కెట్లోని ఓ సెల్ ఫోన్ల దుకాణాన్ని ఎందుచుకున్నారు. 107 ఐ ఫోన్లు కావాలని ఆర్డరిచ్చి ... ఫోన్లు అందిన వెంటనే డబ్బులు ట్రాన్సఫర్ చేస్తామని వ్యాపారిని మోసం చేశారు. వ్యాపారి ఫిర్యాదులో రంగంలోకి దిగిన అబిడ్స్ పోలీసులు గ్యాంగ్ ఆట కట్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . .. .
వాట్సాప్‌లో 107 ఐఫోన్లు ఆర్డర్ చేసి భారీ మోసానికి తెరలేపారు గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ గ్యాంగ్.. వందకు పైగా ఐ ఫోన్లు(iPhones) కావాలని ఆర్డర్ ఇచ్చి.. అవి అందిన వెంటనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తామని నగరానికి చెందిన వ్యాపారిని మోసం చేసింది గుజరాత్ గ్యాంగ్. వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అబిడ్స్ పోలీసులు ముఠా ఆటకట్టించి, ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 102 ఐ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని జగదీష్ మార్కెట్ కు చెందిన ఒక వ్యాపారికి 107 ఐఫోన్లు కావాలంటూ ఆర్డర్ చేశాడు ఒక అగంతకుడు. దీంతో నిజమని నమ్మిన జగదీష్ మార్కెట్ వ్యాపారి మొత్తం 107 ఐఫోన్లను ఆర్డర్ పెట్టేసాడు. తీరా ఐఫోన్లు అన్ని డెలివరీ అయ్యాక డబ్బులు చెల్లించే వ్యవహారంలో ఆ గ్యాంగ్ ఓ వ్యూహాన్ని రచించింది.. మొబైల్ ఫోన్లు గుజరాత్‌కు పంపాలని చెబుతూ ఒక అడ్రస్‌ను వాట్సాప్ లో జగదీష్ మార్కెట్ వ్యాపారికి మెసేజ్ చేశారు. మొబైల్స్ అన్ని అందిన తర్వాతనే తాము పేమెంట్ చేస్తామని జగదీష్ మార్కెట్ వ్యాపారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఇదే నిజమని జగదీష్ మార్కెట్ వ్యాపారి మొత్తం మొబైల్ ఫోన్స్‌ను గుజరాత్‌కు డెలివరీ చేశాడు.
మొబైల్ ఫోన్స్ పంపిన అనంతరం డెలివరీ అయ్యాక డబ్బులు ఇస్తామన్న గుజరాత్ కు చెందిన వ్యక్తులు మొదటగా ఐదు లక్షలు పేమెంట్ చేశారు. అయితే, మిగతా డబ్బును ఎల్లార్ నంబర్ ఆధారంగా పే చేస్తామని జగదీష్ మార్కెట్ వ్యాపారిని నమ్మించారు. ఎల్ఆర్ నంబర్ ఆధారంగా పే చేస్తామని చెప్పడంతో జగదీష్ మార్కెట్ వ్యాపారి పలుమార్లు గుజరాత్ కు చెందిన గ్యాంగ్‌ను సంప్రదించే ప్రయత్నం చేశాడు. అయితే తాను ఎంత సంప్రదించినప్పటికీ డబ్బులు రాకపోవడంతో జగదీష్ మార్కెట్ వ్యాపారి అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు నిందితులు ఇచ్చిన డెలివరీ అడ్రస్ ఆధారంగా గుజరాత్ కు బయలుదేరారు. ప్రత్యేక పోలీసు బృందం గుజరాత్‌లోని సూరత్ కు చేరుకొని ఈ మోసానికి పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు.
వీరిలో కీలక సూత్రధారులుగా ఉన్న విపుల్ అలియాస్ విజయ్ పరారీలో ఉన్నాడు. నీరవ్ రాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని వద్ద నుండి 64 లక్షల రూపాయల విలువచేసే 102 ఐఫోన్లను అబిడ్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే మొత్తం 107 ఫోన్లో 5 ఫోన్లను నిందితులు విక్రయించినట్టుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. నిందితుడిని రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.అయితే ఎవరెవరికి విక్రయించారనే వివరాలను పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల ఉన్న మరి కొంతమంది నిందితుల పాత్రను సైతం అబిడ్స్ పోలీసులు గుర్తించినట్టు సమాచారం. వారికోసం ఇప్పటికే అబిడ్స్ పోలీసులు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో మకాం వేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ స్పష్టం చేశారు