మరొకరితో వెళ్లిపోయిందని.. భార్యను నగ్నంగా నడిపించాడు

V6 Velugu Posted on Jul 15, 2021

దహోద్: తనను వదిలేసి, వేరొకరితో వెళ్లిపోయిందని భార్యను దారుణంగా హింసించి, ఊరందరి ముందు నగ్నంగా నడిపించిన ఘటన గుజరాత్‌లోని దహోద్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆ మహిళ భర్తతో పాటు మరో 18 మందిని అరెస్టు చేశారు.
దహోద్ జిల్లా ధన్‌పూర్ తాలూకాలోని ఓ గిరిజన గ్రామంలో ఓ వ్యక్తి భార్య మరొకరితో వెళ్లిపోవడంతో, అతడితో పాటు ఆ ఊరి వాళ్లు కలిసి ఆమెను వెతుకులాడి పట్టుకున్నారు. ఈ నెల 6వ తేదీన ఆమెను తమ ఊరికి తీసుకుని వెళ్లిన భర్త, ఆమెను ఊరి జనాల ముందు దారుణంగా హింసించాడు. అతడితో పాటు బంధువులు కూడా ఆమెను కొట్టారు. ఆమె అలా మరొకరితో వెళ్లిపోయినందుకు శిక్షగా అందరి ముందు నగ్నంగా నడిపించారు. అలాగే ఆమె భుజాలపై భర్తను కూర్చోబెట్టి నడవాలని  ఈ మొత్తం ఘటనను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అది పోలీసుల దృష్టికి రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ వీడియోలో కనిపించిన ఆ మహిళ భర్తతో పాటు మరో 18 మందిని బుధవారం అరెస్టు చేశామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. అందులో ఎక్కువ మంది ఆ వ్యక్తి బంధువులే ఉన్నారని చెప్పారు.

Tagged arrest, HUSBAND, gujarat, Naked Wife, Extra-marital Affair

Latest Videos

Subscribe Now

More News