ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను చంపించిన భర్త

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను చంపించిన భర్త

తన భార్య పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ వ్యక్తి తన భార్యను చంపించాడు. ఈ అమానుష ఘటన గుజరాత్‌లో జరిగింది. బనస్కాంత జిల్లాకు చెందిన లలిత్ చార్టర్డ్ అకౌంటెంట్‌‌గా పనిచేస్తున్నాడు. ఆయన మూడు నెలల కిందట తన భార్య దక్ష్‌బెన్ ట్యాంక్‌ పేరు మీద రూ. 60 లక్షల ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. అయితే ఎలాగైనా ఆ డబ్బులు కొట్టేయాలని లలిత్ భావించాడు. అందుకోసం తన భార్యను హతమార్చాలని అనుకున్నాడు. అయితే అలా చేస్తే దొరికిపోతానని భావించిన లలిత్.. తన భార్యను పథకం ప్రకారం హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఒక వ్యక్తికి రూ. 2 లక్షలు ఇచ్చి తన భార్యను చంపాలని చెప్పాడు. ఆ చంపడం కూడా ఎవరికీ అనుమానం రాకుండా.. ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ చేసి చంపాలని తెలిపాడు. దాంతో హత్య చేయడానికి ఒప్పుకున్న హంతకుడు.. గత డిసెంబర్ 26న ప్లాన్ అమలుకు సిద్దమయ్యాడు. ఆ రోజు లలిత్ తన భార్యను తీసుకొని గుడికి వెళ్లాడు. ఆ సమయంలో లలిత్, హంతకుడికి సమాచారమిచ్చాడు. లలిత్, తన భార్యకు కొంతదూరంలో నడుస్తుండగా.. హంతకుడు ఒక వాహనంతో వేగంగా వచ్చి దక్ష్‌బెన్‌ను బలంగా ఢీకొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు కూడా ఈ మృతిని యాక్సిడెంట్ కేసుగా నమోదు చేశారు. అయితే ఆమె కుటుంబసభ్యులు మృతి పట్ల అనుమానం వ్యక్తం చేయడంతో.. పోలీసులు దక్ష్‌బెన్ కాల్ డాటా, సీసీటీవీ ఫుటేజ్ వంటివి పరిశీలించారు. అనుమానంతో లలిత్‌ను అదుపులోకి విచారించడంతో అసలు విషయం బయటపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తానే హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. లలిత్‌ను అరెస్ట్ చేశారు. హంతకుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

For More News..

మామూలు బామ్మ కాదు.. 106 ఏళ్ల వయసులో ఆల్బమ్

సన్నీ లియోన్‌పై కేసు నమోదు..

ఐపీఎస్ అధికారికీ తప్పని కట్నం వేధింపులు