గుజరాత్ ఫస్ట్ ఫేజ్: 60 శాతానికి పైగా పోలింగ్

గుజరాత్ ఫస్ట్ ఫేజ్: 60 శాతానికి పైగా పోలింగ్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఫస్ట్ పేస్ పోలింగ్ లో 19 జిల్లాల్లో 89స్థానాలకు ఓటింగ్ జరిగింది. యువ ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. 60.20% శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు కొనసాగింది. 14వేల 382 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. డిసెబంర్ 5న రెండోవిడతలో 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేశ్ ధనాని సైకిల్ పై గ్యాస్ సిలిండర్ తో వచ్చి ఓటు వేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ కుటుంబ సభ్యులతో కలిసి నవ్సారి పోలింగ్ సెంటర్ లో ఓటు వేశారు. అలాగే  క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, జామ్ నగర్ బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఓటేశారు.