గుజరాత్ గడ్డపై గర్జిస్తోన్న RCB బౌలర్స్.. తొలి 10 ఓవర్లలో GT స్కోర్ ఎంతంటే..?

గుజరాత్ గడ్డపై గర్జిస్తోన్న RCB బౌలర్స్.. తొలి 10 ఓవర్లలో GT స్కోర్ ఎంతంటే..?

గాంధీ నగర్: గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఐపీఎల్ 19 ఫైనల్‎లో ఆర్సీబీ బౌలర్లు సత్తా చాటుతున్నారు. గుజరాత్ బ్యాటర్లను వారి సొంత గడ్డపై కట్టడి చేస్తున్నారు. ఆర్సీబీ బౌలర్లు చెలరేగడంతో గుజరాత్ తొలి 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు మోస్తారు స్కోరే చేసింది. 

సూపర్ ఫామ్‎లో ఉన్న జీటీ ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), కెప్టెన్ గిల్ (10) కీలకమైన ఫైనల్ పోరులో చేతులేత్తేశారు. యువ బ్యాటర్ నిశాంత్ సింధు (20) కాసేపు ప్రతిఘటించాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్ వుడ్, రసిఖ్ సలాందార్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం బట్లర్ (14), వాషింగ్టన్ సుందర్ (7) క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లు చివరి దాకా ఇదే జోరు కొనసాగిస్తే గిల్ సేన తక్కువ స్కోర్‎కే పరిమితమయ్యే అవకాశం ఉంది. 

►ALSO READ | టాస్ గెలిచిన ఆర్సీబీ.. గిల్ సేనకు బ్యాటింగ్ అప్పగించిన పాటిదార్.. ఇరు జట్లలో మార్పులు ఇవే!