GT vs MI: బుమ్రా విజ్రంభన.. ముంబై ముందు ఓ మాదిరి లక్ష్యం

GT vs MI: బుమ్రా విజ్రంభన.. ముంబై ముందు ఓ మాదిరి లక్ష్యం

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో రాణించింది. బ్యాటింగ్ పిచ్ పై గుజరాత్ టైటాన్స్ జట్టును నిలువరించింది. బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొడుతూ ఒక మాద్రి స్కోర్ కే గుజరాత్ ను కట్టడి చేసింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు ముందు ఒక మాదిరి లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగుల స్కోర్ చేసింది. 

సాయి సుదర్శన్ 45 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గిల్ 31 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. చివర్లో తివాటియా (22) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. 17 ఓవర్లో మిల్లర్(12), సాయి సుదర్శన్ (45) వికెట్లు తీసుకొని గుజరాత్ భారీ స్కోర్ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న కొయెట్జ్ రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. 

వరుస విరామాల్లో వికెట్లను కోల్పోవడంతో గుజరాత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. సాయి సుదర్శన్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడినా.. మిగిలిన వారు అతనికి సహకరించలేదు. నరేంద్ర మోడీ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుండడంతో ముంబై లక్ష్యాన్ని ఈజీగానే ఛేజ్ చేసే అవకాశం కనిపిస్తుంది.