RR vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్.. విలియంసన్ ఔట్

RR vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్.. విలియంసన్ ఔట్

ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 10) ఆసక్తి సమరం జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. జైపూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో గుజరాత్ 2 మ్యాచ్ ల్లో గెలిస్తే.. రాజస్థాన్ ఆడిన నాలుగు మ్యాచ్ లో గెలిచి ఓటమెరుగని జట్టుగా నిలిచింది. సొంతగడ్డపై రాజస్థాన్ మరో విజయం ఖాయం చేసుకుంటుందో లేకపోతే గుజరాత్ షాక్ ఇస్తుందో చూడాలి. 

గుజరాత్ ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేన్ విలియంసన్ స్థానంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్.. శరత్ స్థానంలో అభినవ్ మనోహర్ కు తుది జట్టులో చోటు దక్కింది. మరోవైపు రాజస్థాన్ జట్టులో నవదీప్ సైనీ ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది.        

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, నవదీప్ సైనీ, యుజ్వేంద్ర చాహల్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): 

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ