GT vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. మూడు మార్పులతో లక్నో

GT vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. మూడు మార్పులతో లక్నో

ఐపీఎల్ లో గురువారం (మే 22) గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లక్నోకి నామమాత్రమే. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రయించిన పంత్ సేన ఈ మ్యాచ్ లో గెలిచినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరోవైపు ఈ మ్యాచ్ లో  గుజరాత్ టైటాన్స్ గెలవడం కీలకం. టాప్- 2 కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి.

ఈ సీజన్ లో గుజరాత్ ఇప్పటివరకు 12 మ్యాచ్ ల్లో 9 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది. మరోవైపు లక్నో ఆడిన 12 మ్యాచ్ ల్లో 5 గెలిచి ఏడో స్థానంలో ఉంది. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే గుజరాత్ ఎలాంటి మార్పులు చేయలేదు. లక్నో జట్టులో ఆకాష్ దీప్, షాబాజ్ అహ్మద్, హిమ్మత్ సింగ్ తుది జట్టులో స్థానం సంపాదించారు. 

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI):

మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, విలియం ఒరూర్కే

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): 

శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ