భారీ వర్షాలకు దెబ్బతిన్న నేషనల్ హైవే

భారీ వర్షాలకు దెబ్బతిన్న నేషనల్ హైవే

దేశంలో వానలు దంచి కొడుతున్నాయి. పలుచోట్ల కురిసిన వర్షాలకు మామూలు రోడ్లే కాదు జాతీయ రహదారి సైతం అస్తవ్యస్తంగా మారింది. గుజరాత్ లో ఇటీవల ఎడతెరపి లేని వానలు కురిసిన విషయం తెలిసిందే.  గత వారం రోజులుగా ఏకంగా 10 సెం.మీ. పైగా వర్షం కురిసింది. దీంతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతుట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. అయితే ఈ వరదల దాటికి వాపి-సిల్వసా ప్రాంతాలను కలిపే NH-48 పూర్తిగా దెబ్బతిన్నది. రహదారి గుండా ఎక్కడ చూసినా గుంతలే. దీంతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేసేందుకు వాహనదారులు, ప్రయాణికులు ఎన్నో పాట్లు పడుతున్నారు. అత్యంత పెద్దదైన జాతీయ రహదారి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మామూలు గ్రామాల పరిస్థితి చెప్పక్కర్లేదు.