గల్ఫ్ బాటలో ఒయాసిస్ డాక్యుమెంటరీ విడుదల

గల్ఫ్ బాటలో ఒయాసిస్ డాక్యుమెంటరీ విడుదల

హైదరాబాద్, వెలుగు: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘గల్ఫ్​ భరోసా’ పథకాన్ని వివరించే  ‘గల్ఫ్ బాటలో ఒయాసిస్’ అనే ఫిల్మ్ డాక్యుమెంటరీని పీసీసీ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్ బుధవారం గాంధీ భవన్ లో విడుదల చేశారు.

 ఉత్తర తెలంగాణలోని పలు గ్రామాల్లో పర్యటించిన ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్ చిత్ర బృందం రూ. 5 లక్షల ఎక్స్‌‌గ్రేషీయా పొందిన గల్ఫ్ మృతుల కుటుంబాల అభిప్రాయాలను ఇందులో చిత్రీకరించింది. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటరీ నిర్మాత మంద భీంరెడ్డి, ఇతరులు పాల్గొన్నారు.