
వేములవాడ, వెలుగు: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వేములవాడలోని సుభాష్‌నగర్‌కు చెందిన దూలం రఘు(35) కొద్ది నెలల కింద కువైట్వెళ్లాడు. వారం కింద పని ముగించుకొని రోడ్డు దాటుతుండగా ఓ వెహికల్ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే చనిపోయాడు. అప్పులు చేసి కొడుకును గల్ఫ్ కి పంపించామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మృతుడికి పెండ్లి కాలేదు. రఘుకు నలుగురు అక్కలు, ఓ సోదరుడు ఉన్నారు. శనివారం ఉదయం రఘు డెడ్‌బాడీ స్వగ్రామం చేరనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.