ఏజెంట్ల మాయమాటలు నమ్మొద్దన్న గల్ఫ్ బాధితులు 

ఏజెంట్ల మాయమాటలు నమ్మొద్దన్న గల్ఫ్ బాధితులు 

ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో చిక్కుకున్న ఎనిమిది మంది నిజామాబాద్ వాసులు స్వదేశానికి చేరుకున్నారు. గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నేతల కృషితో గల్ఫ్ నుండి శంషాబాద్ కు చేరుకున్నారు బాధితులు. క్షేమంగా వచ్చిన బాధితులను శంషాబాద్ ఎయిర్ పోర్టులో గల్ఫ్ బాధితుల సంఘం నేతలు పరామర్శించారు. కువైట్ లో హోటళ్లు, గార్డెన్స్లో ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మబలికి  ఒక్కొక్కరి నుంచి లక్షకుపైగా వసూలు చేశారు. వారి మాయమాటలు నమ్మి మొత్తం 9 లక్షల వరకు కేటుగాళ్లకు అప్పగించారు. 

ఎడారి దేశం కువైట్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తమను షెడ్లు కట్టే పనిలో పెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇద్దరు ఏంజెంట్ల మాయమాటలు నమ్మి అక్కడికి వెళ్లితే తమను ఎవరూ పట్టించుకోలేదన్నారు. దాదాపు నాలుగు నెలలు నరకయాతన అనుభవించామని వాపోయారు. తాము ఏజెంట్లకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. గల్ఫ్ కు వెళ్లేవారు ఏజెంట్ల మాటలు నమ్మి వెళ్లొద్దని సూచించారు. తమను స్వదేశానికి తీసుకొచ్చిన గల్ఫ్ బాధితుల సంఘం నేతలకు ధన్యవాదాలు తెలిపారు.