తీనో మర్ జాతే అన్నా.. ఊపిరి ఆడుతలేదు: కన్నీళ్లు పెట్టిస్తున్న ఇంతియాజ్ చివరి మాటలు

తీనో మర్ జాతే అన్నా.. ఊపిరి ఆడుతలేదు: కన్నీళ్లు పెట్టిస్తున్న ఇంతియాజ్ చివరి మాటలు

బషీర్​బాగ్, వెలుగు: ‘అన్నా అన్నా.. మర్​జాతే అన్నా.. జగే నహే అన్నా.. దర్వాజ బంద్​హే.. దోనో బచ్చే బీ హే.. హమ్​ తీనో మర్​జాతే.. కుచ్​బీ నహీ కర్​సక్​తా.. కుచ్​బీ నహీ దిక్​రా..’ అంటూ గత శనివారం నాంపల్లి బచ్చాస్​ ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాదంలో మరణించిన ఇంతియాజ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. అత్తాపూర్​ సుభాన్​పురాకు చెందిన ఇంతియాజ్​ఫర్నిచర్​ షాపులో పని చేసేవాడు. ఆ రోజు షాపులోనే ఉన్న ఇంతియాజ్​అగ్ని ప్రమాదం జరగడంతో పిల్లలున్న రూమ్ వైపు పరుగులు తీశాడు.

తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిని కాపాడడానికి చివరి వరకు ప్రయత్నించాడు. ఈ లోపే సెల్లార్‎ను పూర్తిగా మంటలు, దట్టమైన పొగ ఆక్రమించాయి. బయటపడలేని పరిస్థితుల్లో తనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, రక్షించాలంటూ షాపులో పని చేసే మరో వ్యక్తితో ఫోన్​చేసి చివరిసారిగా మాట్లాడాడు. ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత బయటకు వచ్చిన ఈ కాల్​రికార్డింగ్​ విన్నవారందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. 

  • ఇంతియాజ్ : హలో అన్న అన్న చచ్చిపోయేలా ఉన్నాము. నాతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు 
  • మరో వ్యక్తి : ఇంతియాజ్ భయపడకు, వెనుక గ్రిల్ డోర్ నుంచి బయటకు రా.. 
  • ఇంతియాజ్ : లేదన్నా.. సెల్లార్ వెనుక నుంచి వచ్చే డోర్ కూడా ఓపెన్ కావట్లేదు. పక్కనే ఉన్న రూమ్ డోర్ కూడా లాక్ చేసి ఉంది. 
  • మరోవ్యక్తి : కింద ఉన్న రెండో సెల్లార్​కు వెళ్లిపో ఇంతియాజ్​  
  • ఇంతియాజ్ :  అన్న.. ఇక్కడ మొత్తం పొగే ఉంది..ఏం కనిపిస్తలేదు. ఊపిరి ఆడుతలేదు. నాతోని ఉన్న ఇద్దరు పిల్లలు స్పృహ కోల్పోతున్నరు.. ఏదో ఒకటి చెయ్​ అన్నా.. 
  • మరో వ్యక్తి : మొబైల్ టార్చ్​ వేసుకొని రెండో సెల్లార్‎కు వెళ్లు ఇంతియాజ్​.. 
  • ఇంతియాజ్ : నాకు ఏం కనిపిస్తలేదన్నా.. చుట్టూ మొత్తం చీకటే.. మంటలు తప్ప ఏం కనిపిస్తలేవు..ఊపిరి ఆడుతలేదు( దగ్గు..ఆయాసంతో)  
  • మరోవ్యక్తి : సమీర్ రూమ్ డోర్ ఓపెన్ చేయి.. దాని నుంచి వెనుక మార్గంలో బయటకు రా..  
  • ఇంతియాజ్ : సమీర్ రూమ్ కూడా లాక్ చేసి ఉందన్నా.. ఇక ఏం చేయలేమన్నా.. -ఊపిరి ఆడక మాట్లాడనీకి కూడ వస్తలేదు. ఇక బయటపడే వచ్చే పరిస్థితి లేదన్నా.. చచ్చిపోతాం అనిపిస్తుందన్నా..అంటూ ఇంతియాజ్ సృహ కోల్పోయాడు. రెస్క్యూ ఆపరేషన్​తర్వాత ఇంతియాజ్​తో పాటు ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు డెడ్​బాడీలను 
  • గుర్తించారు.