తాడ్వాయి, వెలుగు : మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం, దర్శనం పూర్తయిన వారు తిరుగు ముఖం పట్టడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. తాడ్వాయి – మేడారం రూట్‌లో ఆర్టీసీ బస్సులు, వీఐపీ వాహనాలకు తోడు ప్రైవేట్ వెహికల్స్ రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.
ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో 14 కిలోమీటర్ల ప్రయాణానికి 3 గంటలు పట్టింది. అలాగే గోవిందరావుపేట మండలం పస్రా వద్ద రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. డబుల్ రోడ్డులో మూడు వరుసల్లో వాహనాలు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేట్ వాహనాలను పస్రా మీదుగా, ఆర్టీసీ, వీఐపీ వెహికల్స్‌ను తాడ్వాయి మీదుగా మేడారం మళ్లించారు. -
