గల్ఫ్ కార్మికుల ప్రమాద భీమా రూ. 5 లక్షలు : సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ కార్మికుల ప్రమాద భీమా రూ. 5 లక్షలు  :  సీఎం రేవంత్ రెడ్డి

గల్ఫ్ కార్మికుల ప్రమాద భీమా రూ. 5 లక్షలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.  హైదరాబాద్ లోని  హోటల్ తాజ్ డెక్కన్ లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సీఎం   భేటీ అయ్యారు.  ఈ సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , గల్ఫ్ NRI కార్మిక సంఘం నేతలు హాజరయ్యారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను సీఎం స్వయంగా తెలుసుకున్నారు. గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని నేతలు ముఖ్యమంత్రిని కోరారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..   గల్ఫ్ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  తెలంగాణలో 15 లక్షల కుటుంబాలు గల్ఫ్ పైన ఆధారపడి ఉన్నాయన్నారు.  గల్ఫ్  వెళ్లేముందు కార్మికులకు శిక్షణ ఇస్తామని...  ఏజెంట్ల చేతిలొ చిక్కుకుని మోస పోకుండా చర్యలు  తీసుకుంటామని తెలిపారు.  గల్ఫ్ బాధితుల పిల్లలకు మంచి చదువు అందిస్తామన్నారు సీఎం.  గల్ఫ్ ఓవర్సీస్  వెల్ఫేర్ బోర్డు గురంచి ఆలోచిస్తామని చెప్పారు.  

గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తామని సీఎం రేవంత్ తెలిపారు.  సెప్టెంబర్ లోపు  గల్ఫ్ కార్మికుల  కోసంల ప్రణాళిక రూపొందిస్తామన్నారు.  గల్ఫ్  కార్మికులు వారి కుటుంబాల వివరాలు నమోదు చేయిస్తామని సీఎం తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న వాళ్లే ఏజెంట్లగా ఉంటారని..  ఏజెంట్లకు చట్టబద్దత ఉండాలన్నారు సీఎం.