
టాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్పై గత కొద్ది కాలంగా రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ పై విజయ్ కోయాక్టర్ గుల్షన్ దేవయ్య క్లారిటీ ఇచ్చాడు.
విజయ్ను ఆటపట్టించేంత చనువు నాకుంది. కానీ, తమన్నాను నేనెప్పుడూ కలవలేదు. వీరిపై మీడియాలో వస్తున్న వార్తలు చూశానని గుల్షన్ దేవయ్య తెలిపాడు. ఇద్దరి మధ్య రిలేషన్ గురించి నాకు తెలియదు. కానీ.. వీరు ప్రేమలో ఉన్నారనే నాకూ అనిపిస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా తమన్నా, విజయ్‌ల జంట చాలా బాగుంటుంది అంటూ గుల్షన్ చేసిన కాంమెంట్స్ మరోసారి వైరల్‌గా మారాయి.
గతకొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. న్యూ ఇయర్ పార్టీలో వీరిద్దరూ ముద్దుపెట్టుకున్న వీడియో అప్పట్లో దుమారం రేపింది. అయితే అది నిజమా? కాదా? వీడియోలో ఉన్నది వాళ్లేనా.. అనే దానిపై వీరిద్దరూ స్పందించలేదు. దాంతో వీళ్ల రిలేషన్‌పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు వీరిద్దరూ పలు పార్టీలకు కలిసి వెళ్లినట్లు మీడియా కంట కూడా పడ్డారు. ఇదే విషయాన్ని ఎన్ని సార్లు అడిగినా వీరిద్ధరూ స్పందించలేదు.
ఒకసారి వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేశారు. డిన్నర్ తర్వాత ఒకే కారులో వెళ్లారు. అప్పట్లో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. దాంతో పలువురు నెటిజన్లు వీరిద్ధరూ రిలేషన్‌లో ఉన్నట్లు బహిరంగంగానే చర్చించుకున్నారు.
తమన్నా, విజయ్ వర్మలు కలిసి ‘లస్ట్ స్టోరీస్-2’లో నటించారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.