
మాస్ కథలతో పాటు వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ ‘విశ్వక్ సేన్’ బిజీగా మారిపోతున్నాడు. పాగల్ సినిమాతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో.. ‘ఓరి దేవుడా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం మూవీ షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా ఓ లిరికల్ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘విడువనే విడువనే క్షణం కూడా నిన్నే.. బుజ్జమ్మ.. బుజమ్మ’ అంటూ సాంగ్ సాగింది. పాటకు విశ్వక్ సేన్ వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. కాసర్ల శ్యామ్ పాటను రాయగా... కంపోజర్ అనిరుధ్ పాడారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘అవుననవా.. అవుననవా సాంగ్ రిలీజ్ అయ్యింది.
తమిళంలో రూపొందిన ‘ఓ మై కడలేవు’కు రీమెక్. అశ్వత్ మారిమత్తు తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ భామ ‘మిథిలా పాల్కర్’ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా ‘ఆశా భట్’ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో లవ్ గాడ్ గా విక్టరీ ‘వెంకటేష్’ స్పెషల్ రోల్ పోషిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లియన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పీవీపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.