నాగారం సర్పంచ్‌ గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం

నాగారం సర్పంచ్‌ గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం

తుంగతుర్తి, వెలుగు: తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల సమక్షంలో ఇటీవల గెలుపొందిన గ్రామ సర్పంచ్లు, ఉప సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు ప్రమాణస్వీకారం చేశారు.  నాగారం సర్పంచ్ గా గుంటకండ్ల రామచంద్రారెడ్డి(95) సర్పంచ్ గా ప్రమాణస్వీకారం చేశారు.

 సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మాజీ ఎమ్మెల్యేలు గాదర్ కిశోర్ కుమార్, సంకినేని వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు కడియం రామచంద్రయ్య, గాయకులు గోరేటి వెంకన్న, పాల్గొన్నారు