Guntur Kaaram Trailer: మహేష్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రమనగాడి మాస్ జాతర ఇవాళే షురూ

Guntur Kaaram Trailer: మహేష్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రమనగాడి మాస్ జాతర ఇవాళే షురూ

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) హీరోగా వస్తున్న కొత్త చిత్రం గుంటూరు కారం(Guntur Kaaram). టాలీవడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela), ఖిలాడీ భామ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాలా కాలం తరువాత మహేష్ బాబు నుండి వస్తున్న పక్కా మాస్ మసాలా సినిమా కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే గుంటూర్ కారం సినిమాపై హప్ నెక్స్ట్ లెవల్లో పెరుగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6న నిర్వహించాలనుకున్నారు మేకర్స్. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. 

దీంతో మహేష్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే ఆ డిజప్పాయింట్మెంట్ ను మర్చిపోయేలా ఫఅదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. గుంటూరు కారం ట్రైలర్ ను జనవరి 7న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇవాళ యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అవ్వలైందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి గుంటూరు కారం ట్రైలర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరొకొన్ని గంటలు ఆగాల్సిందే.