సంక్రాంతి రేస్ నుంచి గుంటూరు కారం ఔట్?

సంక్రాంతి రేస్ నుంచి గుంటూరు కారం ఔట్?

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh babu) ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో 'గుంటూరు కారం(Gunturu kaaram)' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హై ఎనర్జిటిక్ మాస్ యాక్షన్ గా రూపొందుతోన్న ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెరవేంగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ అండ్ టీజర్ రీలిజ్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రిలీజైన క్షణాల్లోనే యూట్యూబ్ ను ఒక ఊపు ఊపేసింది. 

ఇక తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక న్యూస్ మహేష్ అభిమానులను టెన్షన్ పెట్టిస్తోంది. అదేంటంటే.. అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ కారణంగా షూటింగ్ కంప్లీట్ అవడానికి చాల సమయం పట్టేలా ఉందని సమాచారం. అందుకే ఈ సినిమా రిలీజ్ ను ముందుగా అనుకున్నటుగా సంక్రాంతి రేస్ నుండి తప్పించే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ విషయం తెసులుకున్న మహేష్ అభిమానులు కాస్త డిజపాయింట్మెంట్ లో ఉన్నారట.

ఇక ఈ సినిమాలో మహేష్ జోడీగా పూజ హెగ్డే(Pooja hegde), శ్రీలీల(Sreeleela) నటిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్(Harika Hasini creations) పై రాధాకృష్ణ(Radhakrishna) నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు.