గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్..క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో తెలుసా!

గుంటూరు కారం సెన్సార్ కంప్లీట్..క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో తెలుసా!

ఈ సంక్రాంతికి రాబోతున్న క్రేజీ సినిమాల్లో మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’(GunturKaaram) ఒకటి. భారీ అంచనాల మధ్య డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్ గా రిలీజైన స్పైసీ మాస్ కుర్చీ సాంగ్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. 

లేటెస్ట్గా ఈ సినిమాకు సెన్సార్ కంప్లీట్ అయినట్లు ప్రొడ్యూసర్ నాగవంశీ ట్వీట్ చేశారు. ఈ సినిమా U/A సర్టిఫికెట్ పొందినట్లు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. చూడగానే మజా వస్తుంది..హార్ట్ బీట్ పెరుగుతుంది..ఈల వేయాలి అనిపిస్తుంది!  అంటూ నాగవంశీ అదిరిపోయే కామెంట్ చేశారు.

 

 

సినిమా ఫస్టఫ్ సరదాగా సన్నివేశాలతో సాగుతూ..సెకండాఫ్ లో ఘాటు రేపే మాస్ యాక్షన్ ఉండబోతున్నట్లు సమాచారం.ఇక సినిమా చివరి అరగంటలో హీరో ఎలివేషన్స్, మాస్ మూమెంట్స్తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ మార్కు ఎమోషన్స్ సీన్స్.. పీక్స్ లో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు..ఈ సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్..త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్స్ అయిన అత్తారింటికి దారేది, అల వైకుంఠపురం రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం. 

'U/A' సర్టిఫికేట్: ఎవరైనా దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు రొమాంటిక్ టచ్ఉంటుంది.